![]() |
![]() |
.webp)
ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోమ్ టూర్స్ సెగ్మెంట్ మంచి ఫన్నీగా ఉంది. ముందుగా జడ్జి ఇంద్రజ హోమ్ టూర్ తో స్టార్ట్ అయ్యింది. ఇంద్రజ ఒక పూరి గుడిసె ముందు నిలబడి ఫోజ్ ఇచ్చింది.
ఆ ఫోటో చూసి ఇంద్రజ షాకైపోయింది. ఇక ఆది ఇంద్రజ ఆ గుడిసెలో ఎందుకు ఉందో చెప్పాడు. "అంటే ఆవిడకు ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు ఇచ్చేసి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు." అని చెప్పాడు. తర్వాత రష్మీ ఇంటిని చూపించారు. రష్మీ రేకుల ఇంటి ముందు నిలబడి ఉంది. "ఇంద్రజ తనకు ఉన్నదంతా దానం చేసి పూరింట్లో ఉంటోంది. రష్మీ మాత్రం ఉన్నదాన్ని రెంట్లకు ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్డులో ఉంటోంది." అని చెప్పాడు ఆది. తర్వాత ఆది హోమ్ టూర్ పిక్ ని చూపించారు.
.webp)
ఆది ఒక మురికివాడలో ఉన్నట్టుగా చూపించారు. ఆ పక్కనే ఆది పెద్ద కటౌట్ ని పెట్టారు. ఇక ఆది ఎలా ఆ ఇళ్ల మధ్య నుంచి బయటి ప్రపంచంలోకి వస్తాడు అనే విషయాన్ని నాటీ నరేష్ ఎక్స్ప్లైన్ చేసాడు. "ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకు దూకుతాడు అట్లా అని వెనక ఇంటికి వెళ్తాడు. దొరికి పోగానే ఇలా ఫేస్ పెడతాడు." అనేసరికి ఆది నవ్వేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ లో కొంతమంది స్కూల్ పిల్లలు వచ్చి ట్రేండింగ్ సాంగ్ "బటర్ ఫ్లై, బటర్ ఫ్లై" కి డాన్స్ చేసి చూపించారు. ఐతే ఆ పాట వినిపించడానికి వెల్లడానికి ఆది ఫైర్ అయ్యేసరికి బయటికెళ్లి జోక్స్ వేసుకోండి, ముందు మీరు నాకు 9 వ ఎక్కం చెప్పండి , ఇదంతా కాదు గాని ఇంగ్లీష్ లో మాట్లాడు అంటూ ఒక చిన్నారి ఆదిని చెడుగుడు ఆడేసుకుంది. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.
![]() |
![]() |